MadhuVanam - KathaSamputi

MadhuVanam - KathaSamputi

TelugčinaEbook
Sailaja, Uppaluri Madhupatra
Distributed By Ingram Spark
EAN: 9788196056254
Dostupné online
7,70 €
Bežná cena: 8,56 €
Zľava 10 %
ks

Dostupné formáty

Podrobné informácie

శ్రీమతి ఉప్పలూరి మధుపత్ర శైలజగారి "మధువనం"లో విహరిస్తూంటే పూల పరిమళాలు, పిల్ల తెమ్మెరలు నన్ను పలుకరించాయి. కథలన్నీ ఒక కావ్య ప్రయోజనాన్ని సిద్ధింప జేసుకుని, "హమ్ కిసీ సే కమ్ నహీ" అంటూ గర్వంగా తలెత్తుకుని సాహితీ వేదికపై నిలబడ్డాయి.

శైలజ కథలు ఏవో టైంపాస్ బటానీలు కావు. ప్రతి కథ వెనుక రచయిత్రిదైన సోషల్ కమిట్‌మెంట్ వుంది. "Poetry Instructs as it delights" అని "డాక్టర్ జాన్సన్" అన్నట్లు సమాజానికి సందేశమిస్తూనే మనసులను అలరింప చేసే కథలవి.

"మేధావుల వలస"ను ఇతివృత్తంగా తీసుకొని మలచిన కథ "స్నేహానికన్న మిన్న". ఆంధ్రోళ్ళు తెలంగాణావారిని దోచుకున్నారని  ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో అపోహకు గురైన తెలంగాణా యువకుడు ఆంధ్రా, తెలంగాణావాళ్ళు అమెరికాలో మంచి ఉద్యోగాలన్నీ తమ కైవసం చేసుకుంటున్నారన్న అక్కసుతో అక్కడివారు వారిపై దాడులు చేయడం చూసి నిజాన్ని తెలుసుకుంటాడు. గట్స్ ఉంటేగాని ఇలాంటి థీమ్స్ రాయలేరు శైలజకు ఆ గట్స్ ఉన్నాయి.

హాస్యాన్ని పండించడం రచయితకు కత్తిమీద సాము. మా శైలజ సవ్యసాచి. "ఎంత ఘాటు ప్రేమయో" కథలో పెళ్ళికి ముందు ప్రేమించుకోలేదనే లోటును ఇద్దరు భార్యాభర్తలు ఎలా "కలర్ ఫుల్"గా తీర్చుకున్నారో తెలిసి నవ్వుకుంటాం బిగ్గరగా. ఆరోగ్యకరమైన హాస్యం! ''జబర్దస్త్ '' లాంటి వెకిలి లైవ్‌షోల వాళ్ళు ఇలాంటి చక్కని హాస్య కథలను స్కిట్‌లుగా మార్చి ప్రేక్షకుల కందిస్తే బాగుంటుంది.  


పాణ్యం దత్తశర్మ , వనస్థలిపురం, హైద్రాబాద్     

EAN 9788196056254
ISBN 8196056257
Typ produktu Ebook
Vydavateľ Distributed By Ingram Spark
Dátum vydania 12. januára 2023
Stránky 178
Jazyk Telugu
Krajina Uruguay
Autori Sailaja, Uppaluri Madhupatra